Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ప్రతి కుటుంబానికి బీమా భరోసా – సర్పంచ్ బాదావత్ వీరయ్య

Updated : 28 Nov 2026 19:26 IST
As Preferred Source 1 min read
ప్రతి కుటుంబానికి బీమా భరోసా – సర్పంచ్ బాదావత్ వీరయ్య

మునగాల మండలం సీతానగరం గ్రామంలో శనివారం ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాదావత్ వీరయ్య మాట్లాడుతూ.. కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పథకంలో తమ వివరాలను నమోదు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ బీమా సదుపాయం పేద, మధ్యతరగతి కుటుంబాలకు భరోసాగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాదావత్ వీరయ్య, పంచాయతీ కార్యదర్శి నవిత, సూర్యాపేట జిల్లా డిసీసీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లపు సతీష్, సీనియర్ రిపోర్టర్ పడిశాల నాగరాజు, 2వ వార్డ్ మెంబర్ జ్యోతి, 3వ వార్డు మెంబర్ పుల్లూరు ఉపేందర్, 8వ వార్డు మెంబర్ లాలమ్మ, గ్రామ పెద్దలు లెక్కల సుధాకర్ చౌదరి, పుల్లూరి శివాజీ, పుల్లూరి రమేష్, వరుకుప్పల సూరి,అంగన్వాడి టీచర్లు లలిత, లక్ష్మి, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి కుటుంబానికి బీమా భరోసా – సర్పంచ్ బాదావత్ వీరయ్య

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి