మునగాల మండల పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం ఉదయం దట్టమైన మంచు కురిసింది. మంచు కారణంగా రహదారులు, పంట పొలాలు, పరిసర ప్రాంతాలు తెల్లటి పొగమంచుతో కమ్ముకున్నాయి. ఉదయం వేళల్లో ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచు ప్రభావంతో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు చలికి ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పనులకు వెళ్లే కూలీలు, రైతులు కూడా చలి ప్రభావానికి గురయ్యారు.
మునగాల మండలంలో మంచు ప్రభావం.. చలితో ప్రజల ఇబ్బందులు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి