Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / మేడ్చెల్ మల్కాజ్‌గిరి

సీఎంఆర్ బొల్లారం శాఖలో ఘనంగా తొలి వార్షికోత్సవ వేడుకలు*

Updated : 28 Nov 2026 20:44 IST
As Preferred Source 1 min read
సీఎంఆర్ బొల్లారం శాఖలో ఘనంగా తొలి వార్షికోత్సవ వేడుకలు*

సీఎంఆర్ ఉడాన్–2026’ పేరుతో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు

బొల్లారంలోని సీఎంఆర్ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు ‘సీఎంఆర్ ఉడాన్–2026’ పేరుతో ఘనంగా నిర్వహించారు. సంస్థల ఛైర్మన్ సీహెచ్ శ్రీశైలం రెడ్డి, కరస్పాండెంట్ ఛైర్మన్ సీహెచ్ సౌజన్య రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మేడ్చల్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు.

అకడమిక్ డైరెక్టర్ అనురాధ విద్యావ్యవస్థలో మార్పులు, విద్యార్థుల సమగ్ర వికాసంలో విద్యాసంస్థల పాత్రను వివరించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తమ పిల్లల ప్రతిభను చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ. లావణ్య, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనిల్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

సీఎంఆర్ బొల్లారం శాఖలో ఘనంగా తొలి వార్షికోత్సవ వేడుకలు*

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి