Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దసరా నవరాత్రి ఉత్సవాలకు సీఐ వెంకటేష్‌కు ఆహ్వానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:06 PM

పోలీస్ క్రీడా ప్రతిభకు పదును

పోలీస్ క్రీడా ప్రతిభకు పదును

పోలీస్ క్రీడా ప్రతిభకు పదును
10-10-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

యాదాద్రి–V జోన్‌ స్థాయి ఎంపికలు ప్రారంభించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్.

నల్లగొండ: పోలీస్ సిబ్బందిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, రాష్ట్రస్థాయి పోటీలకు ఉత్తమ క్రీడాకారులను ఎంపిక చేయడమే లక్ష్యంగా 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026కు జోనల్ స్థాయి ఎంపికలు నిర్వహించారు. శనివారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో యాదాద్రి–V జోన్‌ స్థాయి ఎంపికలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రారంభించారు.

పోలీస్ విధులతోపాటు క్రీడల్లోనూ రాణించడం ద్వారా శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని ఎస్పీ పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటుతూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో భాగంగా క్లస్టర్‌–D పోటీలు నవంబర్‌ 3 నుంచి 5 వరకు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో, క్లస్టర్‌–E పోటీలు నవంబర్‌ 25 నుంచి 28 వరకు నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జరగనున్నాయి. వివిధ క్రీడాంశాల్లో పురుషులు, మహిళలకు పోటీలు నిర్వహించనున్నారు.

జోనల్‌ స్థాయి ఎంపికల్లో క్రీడాకారుల ప్రతిభ, నైపుణ్యం, శారీరక సామర్థ్యాన్ని పరిశీలించి ఉత్తములను ఎంపిక చేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రమేష్‌, డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్‌ఐలు సంతోష్‌, హరిబాబు, శ్రీనుతోపాటు పోలీస్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

Sthanikam

పోలీస్ క్రీడా ప్రతిభకు పదును

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News