Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జై శ్రీరామ్ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:08 PM

మానసిక ఆరోగ్యంపై అవగాహన అవసరం

మానసిక ఆరోగ్యంపై అవగాహన అవసరం

మానసిక ఆరోగ్యంపై అవగాహన అవసరం
10-10-2026 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

మల్కాజిగిరి, అక్టోబర్ 10: మానసిక ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మల్కాజిగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు సూచించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మానసిక సమస్యలను తొలిదశలోనే గుర్తించడం, అవసరమైనప్పుడు వైద్య సహాయం పొందడం, సమస్యలతో బాధపడుతున్నవారికి అండగా నిలవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

బాధితుల అనుభవాలకు ప్రాధాన్యం

‘అనుభవాలకు ప్రాధాన్యత.. నిజమైన గొంతుకలు.. నిజమైన మార్పు’ అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి అనుభవాలను గౌరవించాలని, వారి అభిప్రాయాలను శ్రద్ధగా వినాలని సూచించారు. బాధితుల పట్ల వివక్ష చూపకుండా సానుభూతితో వ్యవహరించాలని, వారికి అవసరమైన సహకారం అందించాలని తెలిపారు. నాణ్యమైన మానసిక ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా, ఆర్‌ఎంఓ డాక్టర్ సాయి శోభ, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ మాధురి, డాక్టర్లు సంజీవ్ నాయక్, కాశీనాథ్, కిరణ్, హరిత, రవీంద్ర, తేజస్విని, స్వాతి, శాంతి, ప్రొఫెసర్‌, హెచ్‌ఓడీ డాక్టర్ విజయశ్రీ, డాక్టర్ మీనా, పీఆర్వో డాక్టర్ పి. వినోద్, డాక్టర్ సనా, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్లు రోజలిన్, ఫాతిమా, ల్యాబ్ టెక్నీషియన్ రాజేందర్, డీఈఓలు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

మానసిక ఆరోగ్యంపై అవగాహన అవసరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News