వెలిమినేడు: గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో వెలిమినేడు గ్రామంలో ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలను మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఘనంగా నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో పండుగ సంబరాలను జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రారెడ్డి, ఉపసర్పంచ్ అంతటి స్వప్న సత్తయ్యగౌడ్, వార్డు సభ్యుడు నోముల రామకుమార్, పంచాయతీ కార్యదర్శి తాటికొండ లింగస్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అంతటి పారిజాత నరసింహ, మాజీ సర్పంచ్ దేశభైన మల్లమ్మ, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు అంశాల సత్యనారాయణ, మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ వీరేశం, కాంగ్రెస్ గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి కర్దూరి అంజిరెడ్డి, సహాయ కార్యదర్శి గోలి నరేష్, ఉపాధ్యక్షుడు తాటికొండ సత్యనారాయణ, మాజీ వార్డు సభ్యురాలు అంతటి శోభా రాజు, టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఆరూరి శ్రీశైలం, బీజేపీ నాయకుడు వెల్ది రాఘవరెడ్డితో పాటు గ్రామ మహిళలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి