దేవి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని మునగాల ఎస్సై సంజీవరెడ్డి నిర్వాహకులకు శనివారం ఒక ప్రకటనలో సూచించారు. ఉత్సవాల సందర్భంగా మండపాల ఏర్పాటు కోసం పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారులకు దూరంగా మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.మండపాల వద్ద డీజేలకు, అశ్లీల పాటలు, నృత్యాలకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విద్యుత్ సరఫరా, అగ్నిప్రమాదాల నివారణతో పాటు భక్తుల భద్రతకు అవసరమైన పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసుల నిబంధనలను పాటిస్తూ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్సై సంజీవరెడ్డి
కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి