మహేశ్వరం; అక్టోబర్,10 (స్థానికం)
మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్ అల్కాపురి కాలనీలో అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం మాజీ కార్పొరేటర్ డివిజన్ జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దేప సురేఖ భాస్కర్ రెడ్డి,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..దేప సురేఖ భాస్కర్ రెడ్డి గారు మహిళలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని, పూలను పూజించే తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని కొనియాడారు. ఆడపడుచులందరూ కలిసికట్టుగా, ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకోవడం సంతోషదాయకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అల్కాపురి కాలనీ మహిళా మండలి వారు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి