నల్లగొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న అఖిలభారత 36వ రైతు మహాసభలను విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దేవరం వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం మునగాల మండల కేంద్రంలో రైతులతో కలిసి మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎకరాకు రూ.30 వేలకు పైగా పెట్టుబడి పెట్టి సాగు చేసిన వరి పంటలు విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. పంటలను కాపాడేందుకు రోజుకు కనీసం 16 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కార్యదర్శులు గడ్డం వినోద్, కిన్నెర వెంకన్నతో పాటు రైతులు దేవరం శ్రీనివాస్ రెడ్డి, గిరిబాబు, శ్యామ్ సుందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతు మహాసభలను జయప్రదం చేయండి – దేవరం వెంకటరెడ్డి

Harish reporter

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి