సూర్యాపేట జిల్లా కె నరసింహ, ఐపిఎస్ ఆదేశాల మేరకు,అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి సూచనల మేరకు, కోదాడ డీఎస్సీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని కిట్స్ కళాశాలలో అంతర్జాతీయ బాలికా దినోత్సవ లో భాగంగా శనివారం షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు సైబర్ నేరాలు, మహిళల భద్రతపై అవగాహన కల్పించారు. షీ టీమ్ ఎస్‌ఐ మల్లేష్ మాట్లాడుతూ, మహిళలు, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆత్మరక్షణ మెళకువలు నేర్చుకోవాలని, వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దని సూచించారు.టీ సేఫ్ యాప్ వినియోగం, బాల్యవివాహాలు, బాల కార్మిక చట్టాలు, లోన్ యాప్‌ల మోసాలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. వేధింపులకు గురైతే షీ టీమ్ నంబర్ 8712686056కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాది ఉయ్యాల నర్సయ్య, షీ టీమ్ మహిళా కానిస్టేబుళ్లు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
బాలికల భద్రతకు షీ టీమ్ భరోసా.. సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం

Harish reporter
సూర్యాపేట జిల్లా కె నరసింహ, ఐపిఎస్ ఆదేశాల మేరకు,అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి సూచనల మేరకు, కోదాడ డీఎస్సీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని కిట్స్ కళాశాలలో అంతర్జాతీయ బాలికా దినోత్సవ లో భాగంగా శనివారం షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు సైబర్ నేరాలు, మహిళల భద్రతపై అవగాహన కల్పించారు. షీ టీమ్ ఎస్‌ఐ మల్లేష్ మాట్లాడుతూ, మహిళలు, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆత్మరక్షణ మెళకువలు నేర్చుకోవాలని, వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దని సూచించారు.టీ సేఫ్ యాప్ వినియోగం, బాల్యవివాహాలు, బాల కార్మిక చట్టాలు, లోన్ యాప్‌ల మోసాలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. వేధింపులకు గురైతే షీ టీమ్ నంబర్ 8712686056కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాది ఉయ్యాల నర్సయ్య, షీ టీమ్ మహిళా కానిస్టేబుళ్లు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి