తొలిరోజు బాల త్రిపుర సుందరిగా అమ్మవారి దర్శనం
చౌటుప్పల్ భవానీ నగర్‌లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నేటి (ఆదివారం) నుండి ఈ నెల 21వ తేదీ బుధవారం వరకు ఈ నవరాత్రి వేడుకలు నిర్వహించనున్నారు. ఉత్సవాల తొలి రోజు అమ్మవారు భక్తులకు 'బాల త్రిపుర సుందరి' అలంకారంలో దర్శనమిచ్చి ప్రత్యేక పూజలు అందుకున్నారు.ఉత్సవాల ప్రారంభం సందర్భంగా తొలి రోజు పూజా కార్యక్రమాలను చౌటుప్పల్ పురపాలక చైర్మన్ పావని రమేష్ గౌడ్ దంపతులు, స్థానిక 19వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ - అనిత దంపతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.వేద పండితులు పెద్ది సుధాకర్ శర్మ, పెద్ది కిషోర్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు, విశేష హోమాలు జరిగాయి.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి గురు స్వామి, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ ఈడుదుల మస్తాన్ బాబు, కౌన్సిలర్లు కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, చింతల ఉమామహేశ్వరి సాయిలు, పాక చిరంజీవి, కొసనం రాకేష్ రెడ్డి, ధర్మకర్తలు వర్కాల రవి - వెన్నెల గౌడ్, ఆవుల యేసు యాదవ్, దాడి యశ్వంత్ రెడ్డి, గగులోతు అరుణ శంకర్ నాయక్, బొంగు జంగయ్య గౌడ్, సుర్వి నరసింహా గౌడ్, ఉప్పల కుసుమ - కృష్ణ,చింతల కరుణ - తిరుమల్ రెడ్డి, కొశనం అనురాధ - రామిరెడ్డి, దాచేపల్లి లక్ష్మీ - ప్రకాష్, పాత్రికేయులు సామిడి రాఘవరెడ్డి, బత్తుల శ్రీశైలం గౌడ్, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, గుర్రం వెంకటేశం, ఉడుగు రమేష్ గౌడ్, గుజ్జుల రవీందర్ రెడ్డి, కంచరకుంట్ల శశిధర్ రెడ్డి, బాల్యం వెంకటాచలం, దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి