Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అభివృద్ధి నిరంతర ప్రక్రియ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:00 PM

ఆందోల్ మైసమ్మ ఆలయం వద్ద విషాదం.. నిద్రలోనే వృద్ధుడి మృతి

11-10-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మల్కాపురం గ్రామ పరిధిలోని ఆందోల్ మైసమ్మ ఆలయం సమీపంలో నిరాశ్రయుడైన ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో (అనారోగ్యంతో) మృతి చెందాడు. తమిళనాడుకు చెందిన ఈ వ్యక్తి కొద్ది సంవత్సరాలుగా అక్కడే తలదాచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన బాబా (సుమారు 60 సంవత్సరాలు) గత ఐదు సంవత్సరాలుగా తనకు ఎవరూ లేరంటూ చౌటుప్పల్ మండలం, మల్కాపురం పరిధిలోని ఆందోల్ మైసమ్మ ఆలయ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆలయ ప్రాంగణంలోని దుకాణాల వద్ద పాత కాగితాలు సేకరిస్తూ జీవనం వెల్లదీస్తున్నాడు.​ఇటీవల కాలంలో బాబా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సరిగ్గా ఆహారం కూడా తీసుకోలేకపోతున్నట్లు స్థానికులకు తెలిపాడు.​ఆయన పరిస్థితిని గమనించిన స్థానికులు గతంలో అతనికి వైద్య చికిత్స కూడా అందించినట్లు సమాచారం.

​ఈ నేపథ్యంలోనే, ఈరోజు ఉదయం సుమారు 10:00 గంటల సమయంలో మైసమ్మ ఆలయ బస్టాండ్ వద్ద నిద్రిస్తున్న స్థితిలోనే అతను మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు.​ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు, మృతికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Sthanikam

ఆందోల్ మైసమ్మ ఆలయం వద్ద విషాదం.. నిద్రలోనే వృద్ధుడి మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News