వనస్థలిపురం, అక్టోబర్ 11: వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ప్రశాంత్‌నగర్ కాలనీకి చెందిన వల్లభనేని బాలాజీనాథ్ తండ్రి రూపేంద్రనాథ్ పెద్దకర్మ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ దివంగత రూపేంద్రనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం బాలాజీనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, మాజీ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నేలపాటి రామారావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి, డివిజన్ అధ్యక్షులు కొల్లూరి శ్రీనాథ్, పి.గణేష్‌రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి స్వర్ణ మాధవి, అధికార ప్రతినిధి దాము మహేందర్ యాదవ్, ఉపాధ్యక్షుడు బాలకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి