Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు మునగాలలో ‘రైతు నేస్తం’ ప్రత్యక్ష ప్రసారం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:04 PM

2028 జూన్‌ నాటికి శ్రీశైలం సొరంగ మార్గం పూర్తి..

11-10-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్గొండ జిల్లాలోని ప్రతి గ్రామానికీ డబుల్ రోడ్డు..​గుడిసెలు లేని తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం..

​రాష్ట్ర రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

​రూ.74 కోట్లతో రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన..

​నల్గొండ : 2028 జూన్ నాటికి శ్రీశైలం ఎడమగట్టు సొరంగ మార్గం పనులను పూర్తి చేసి రైతులకు రెండు పంటలకూ సాగునీరు అందించడమే తన జీవిత లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు, నల్గొండ జిల్లాలోని ప్రతి గ్రామానికి, తండాకు డబుల్ రోడ్డు సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. ఆదివారం నల్గొండ జిల్లాలో రూ.74 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పలు రహదారి అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపనలు చేశారు.

​రహదారుల శంకుస్థాపనలు..

కనగల్ మండలం తేలకంటిగూడెం...

వద్ద తేలకంటిగూడెం నుండి తొరగల్లు, జంగమాయిగూడెం, మీదుగా ముషంపల్లి గ్రామం వరకు రూ.41 కోట్లతో చేపడుతున్న రోడ్డు విస్తరణ, పటిష్టపరిచే పనులకు భూమిపూజ చేశారు. శేరి లింగోటం వద్ద నల్గొండ-నిడమానూరు రోడ్డు నుండి చెట్ల చెన్నారం, చిన్నమాదారం మరియు తంగెళ్లవారిగూడెం మీదుగా ముషంపల్లి వరకు రూ.33 కోట్లతో చేపట్టే రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన నిర్వహించారు.

​మౌలిక వసతులు - ఉపాధి అవకాశాలు..

​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో రూ.1,600 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. ఒక్క నల్గొండ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసమే రూ.900 కోట్లు కేటాయించామన్నారు. రహదారులు మెరుగైతే పరిశ్రమలు, రైస్ మిల్లులు ఏర్పాటై రవాణా సౌకర్యాలు విస్తరిస్తాయని, దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి భూముల విలువలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.

​ఇందిరమ్మ ఇళ్లు - ప్రజా సంక్షేమం..

​రాష్ట్రాన్ని 'గుడిసెలు లేని తెలంగాణ'గా మార్చడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని మంత్రి ఉద్ఘాటించారు. తేలకంటిగూడెం గ్రామానికి ఇప్పటికే 107 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, గ్రామంలో మిగిలిన అర్హులైన పేదలందరికీ త్వరలోనే ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎల్‌-1, ఎల్‌-3 డేటాలో సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ అర్హులకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే గ్రామంలో ఇళ్ల పట్టాలు లేని వడ్డెర కులస్తులకు పట్టాలు అందజేశామని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్, సన్నబియ్యం, రేషన్ కార్డులు, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ వంటి చారిత్రాత్మక పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. రాబోయే బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు చిలకపచ్చ రంగు చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపారు.

​నీటి పొదుపుపై పిలుపు..

​'ఎల్ నినో' ప్రభావం వల్ల వర్షపాతం తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా నీటిని పొదుపుగా వాడుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ, పరిసర గ్రామాల తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చెరువులను నింపేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. శ్రీశైలం సొరంగ మార్గం పూర్తయితే ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని, రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే తన అభీష్టమని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఆర్‌ అండ్‌ బీ ఎస్ఈ మోహన్, ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, ఆర్‌ అండ్‌ బీ ఈఈ శ్రీధర్ రెడ్డి, కనగల్ తహసిల్దార్ పద్మ, ఎంపీడీవో వేద రక్షిత, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలతో పాటు స్థానిక సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

2028 జూన్‌ నాటికి శ్రీశైలం సొరంగ మార్గం పూర్తి..

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News