Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు మునగాలలో ‘రైతు నేస్తం’ ప్రత్యక్ష ప్రసారం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 10:04 PM

నేడు మునగాలలో ‘రైతు నేస్తం’ ప్రత్యక్ష ప్రసారం

11-10-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మరానున్న రబీ సీజన్‌లో పంటల ఎంపిక, పంటల వైవిధ్యీకరణ, శాస్త్రీయ సాగు పద్ధతులపై రైతులకు దిశానిర్దేశం చేసేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమం నేడు మునగాల మండలంలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఉదయం 10 గంటల నుంచి మునగాల, రేపాల, ఆకుపాముల రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రబీ సాగులో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ముఖ్యమంత్రి రైతులకు అవగాహన కల్పించనున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంచుకోవడం, సాగులో శాస్త్రీయ విధానాలను పాటించడంపై సూచనలు అందించనున్నారు. ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు ఉదయం 10 గంటలకే సంబంధిత రైతు వేదికలకు చేరుకుని కార్యక్రమంలో పాల్గొనాలని మునగాల మండల వ్యవసాయ అధికారి రాజు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.

Sthanikam

నేడు మునగాలలో ‘రైతు నేస్తం’ ప్రత్యక్ష ప్రసారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News