యూకేలో ఉన్నత చదువులు పూర్తి చేసి, హైదరాబాద్‌లో రీసెర్చ్ స్కాలర్‌గా కొనసాగుతున్న ఓ యువకుడు బస్సులో ప్రయాణిస్తుండగా గుండెపోటుతో (ఛాతినొప్పితో) మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా, నాదెండ్ల గ్రామానికి చెందిన గంగవరపు చైతన్య (33) ఐదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్‌లో (యూకే) ఉంటూ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. సుమారు రెండు నెలల క్రితం హైదరాబాద్‌కు తిరిగి వచ్చి, అద్దె గదిలో ఉంటున్నాడు.ఈ నెల 10వ తేదీ ఉదయం చైతన్య తన అన్న గంగవరపు అవినాష్‌కు ఫోన్ చేసి, గత రెండు రోజులుగా ఛాతినొప్పితో బాధపడుతున్నానని, ఇంటికి వస్తున్నట్లు తెలిపాడు.అదే రోజు ఉదయం 11:30 గంటలకు లక్ష్మీ కిషోర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు (నంబర్: NL 01 B 1346) ఎక్కి చిలకలూరిపేటకు బయలుదేరాడు.ప్రయాణ మార్గంలో చౌటుప్పల్ పరిధిలోని లక్కారం బ్రిడ్జి వద్దకు రాగానే చైతన్యకు తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో బస్సు హెల్పర్‌కు సమాచారం అందించాడు.బస్సు వలిగొండ ఎక్స్‌రోడ్డు వద్దకు చేరుకున్న సమయానికి హెల్పర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేయగా,మధ్యాహ్నం 2:15 గంటలకు చైతన్యను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడ చైతన్యను పరీక్షించిన వైద్యులు, అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు.మృతుని అన్న అవినాష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు.
బస్సులో విషాదం.. ఛాతినొప్పితో యువ రీసెర్చ్ స్కాలర్ మృతి

K.RAVI

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి