యాదాద్రి-భువనగిరి జిల్లా
బిఆర్ఎస్ కార్యాలయంలో దశాబ్ది ఉత్సవాల వేదికగా సత్కారం
లాఠీ దెబ్బలు, కేసులు ఎదుర్కొని ప్రత్యేక రాష్ట్ర సాధనలో క్రియాశీల పాత్ర
తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా కీలక పాత్ర పోషించి, రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన బి ఆర్ ఎస్ వి మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు నలపరాజు రమేష్ ని యాదాద్రి-భువనగిరి జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పార్టీ నాయకులు ఆయన సేవలను కొనియూడుతూ శాలువా కప్పి సత్కరించారు.నిజాం కాలేజీ నుంచి మునుగోడు వరకు..నాడు తెలంగాణ ఉద్యమ ఉధృతి చరమానికి చేరిన తరుణంలో నిజాం కళాశాలలో విద్యనభ్యసిస్తున్న నలపరాజు రమేష్.. ఉద్యమ భావజాలానికి ఆకర్షితులయ్యారు. అటు నిజాం కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలోనే కాకుండా, మునుగోడు నియోజకవర్గంలోనూ విద్యార్థులను, యువతను చైతన్యపరుస్తూ ఉద్యమంలో ముందువససలో నిలిచారు.ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా సాగిన ఈ ప్రయాణంలో పోలీసుల లాఠీ దెబ్బలను, ఎన్నో అక్రమ కేసులను సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని రాష్ట్ర ఏర్పాటులో తన వంతు భాగస్వామ్యం అందించారు. నాటి ఆయన పోరాట పటిమను, నిస్వార్థ సేవలను గుర్తుచేసుకుంటూ జిల్లా బి ఆర్ ఎస్ నాయకులు ఈ అరుదైన సత్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ప్రముఖులు, ఉద్యమకారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి