నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన నేపథ్యంలో, చెరువులు, కుంటలను నింపేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ మేదరమెట్ల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.
మంగళవారం ఎల్-30, ఎల్-31 లిఫ్ట్ ఇరిగేషన్ ఆయకట్టు రైతుల సమావేశం మంగళవారం మునగాల మండలం కొక్మిణి గ్రామంలో లిఫ్ట్ మొదటి దశ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, అస్తవ్యస్త విద్యుత్ సరఫరా కారణంగా లిఫ్ట్ మోటార్లు సక్రమంగా పనిచేయడం లేదన్నారు. రైతుల పంటలను కాపాడేందుకు రాబోయే 15 రోజులపాటు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని అధికారులను కోరారు.
ఈ సమావేశంలో కొక్కిరేణి సర్పంచ్ దాసరి శ్రీను, ఎర్రం వెంకటరెడ్డి, నందిగామ సైదులు, చనగాని సాంబయ్య, మాజీ సర్పంచ్ రావులపెంట వెంకన్నతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి