వృద్ధులకు బెడ్షీట్లు, నిత్యావసర సరుకుల పంపిణీ
వనస్థలిపురం, అక్టోబర్ 13: తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి జన్మదినాన్ని పురస్కరించుకుని వనస్థలిపురంలోని వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శివప్రకాష్ నేతృత్వంలో వృద్ధులకు అన్నదానం చేయడంతో పాటు బెడ్షీట్లు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను ఆడంబరాలకు దూరంగా నిర్వహిస్తూ, వృద్ధులకు సేవ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సేవాభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
మధుసూదనాచారికి శుభాకాంక్షలు
ఈ సందర్భంగా శివప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సిరికొండ మధుసూదనాచారి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో యువజన నాయకులు నవీన్, రాకేష్, వినయ్ కుమార్, రవి యాదవ్, సాయి యాదవ్, కళ్యాణ్, రాజ్, లక్కీ గౌడ్, శరత్, కౌశిక్, వంశీ, మజీద్, నవీన్ కుమార్, పవన్, నరేష్, ఆసిఫ్, ప్రవీణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి