హాజరైన ఎంపీ ఆర్. కృష్ణయ్య
చౌటుప్పల్ విద్యుత్ డివిజన్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ విద్యుత్ బి.సి. ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఉదయం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, బహుజనుల హక్కులు, బాలికల విద్య కోసం జీవితాంతం పోరాడిన పూలే దంపతుల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి వారు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో బి.సి. సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె. కుమార స్వామి, కార్యనిర్వాహక అధ్యక్షులు జి. బ్రహ్మేంద్రరావు, ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్, కంపెనీ అధ్యక్షులు పి. యాదగిరి, కార్యదర్శి బొబ్బిలి మురళి, యాదాద్రి ఎస్.ఇ. ఆపరేషన్ కందాల సురేష్ కుమార్, డిఇ టెక్నికల్ టి.ఎస్. సుధీర్ కుమార్, ఎస్.ఎ.ఓ. కె. హరీశ్ కుమార్, చౌటుప్పల్ డిఇ డి. ఎన్. మల్లిఖార్జున గౌడ్, భువనగిరి డిఇ సంగెం వెంకటేశ్వర్లు, డిఇ/డిసిఐ టి. శ్రీనివాసులు, డిఇ ఎన్ఆర్టి విజయభాస్కర్ రెడ్డి,చౌటుప్పల్ ఎడిఇ మర్రి పద్మ, చౌటుప్పల్ ఎఇ రాజుల సతీష్, జిల్లా అధ్యక్షులు ధరణికోట నరేశ్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు కూరాకుల అంజయ్య, జిల్లా కార్యదర్శి జిల్లెపల్లి వెంకటేశ్వర్లు, చౌటుప్పల్ డివిజన్ కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి