రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య డిమాండ్.
చిట్యాల: మెదక్‌లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య డిమాండ్ చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన తీవ్రంగా బాధించిందని, ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని కిష్టయ్య పేర్కొన్నారు. దొరల పెత్తనాన్ని ఎదిరించి, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన ఆమె విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత బాధాకరమన్నారు.
రజకులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించాలని, ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి అరెస్టు చేయడంతోపాటు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే తెలంగాణవ్యాప్తంగా రజక సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తామని గోలి కిష్టయ్య హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి