Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులకు ఉరిశిక్ష విధించాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 04:23 PM

రూ.20 లక్షల లంచం! ఏసీబీకి చిక్కిన తహశీల్దార్‌, సర్వేయర్‌.

13-10-2026 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

లేఅవుట్‌ సర్వే నివేదిక కోసం రూ.30 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణ

అబ్దుల్లాపూర్‌మెట్‌, అక్టోబర్‌ 13: లేఅవుట్‌ జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వే నివేదిక జారీ చేసేందుకు రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్‌ బి. సుదర్శన్‌రెడ్డి, మండల సర్వేయర్‌ బటుక శ్రీనివాసులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. లేఅవుట్‌ క్లియరెన్స్‌ కోసం తొలుత రూ.30 లక్షలు డిమాండ్‌ చేయగా, చివరకు రూ.20 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు ఆరోపణలు ఉన్నాయి.

సర్వేయర్‌ ద్వారా వసూలు

తహశీల్దార్‌ ఆదేశాల మేరకు సర్వేయర్‌ శ్రీనివాసులు బాధితుడి నుంచి రూ.20 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. సర్వేయర్‌ చేతులకు నిర్వహించిన రసాయన పరీక్షలో పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. లంచం సొమ్ము రూ.20 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరి అరెస్ట్‌.. కోర్టుకు తరలింపు

ఈ కేసులో తహశీల్దార్‌ సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్‌ శ్రీనివాసులును అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగే ఉద్యోగులపై ఫిర్యాదు చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని ఏసీబీ అధికారులు సూచించారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్‌ చేస్తే టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

రూ.20 లక్షల లంచం! ఏసీబీకి చిక్కిన తహశీల్దార్‌, సర్వేయర్‌.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News