రంగురంగుల పూలతో బతుకమ్మల అలంకరణ.. విద్యార్థినుల సందడి
భువనగిరి, అక్టోబర్ 13: భువనగిరి పట్టణంలోని రాయగిరి పరిధిలో గల యూనిటీ ఫార్మసీ కళాశాలలో మంగళవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రకాల రంగురంగుల పూలతో విద్యార్థినులు అందంగా పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అంపటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను విద్యార్థులు, అధ్యాపకులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారని తెలిపారు. ఇలాంటి వేడుకలు విద్యార్థుల్లో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించడంతోపాటు సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంచుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు సోమచంద్రుడు, పి. గోవర్ధన్ రెడ్డి, పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ఎస్. సరిత, ఏవో సునీత రెడ్డి, అధ్యాపకులు మోహిని, రాజీవ్, ఇస్మాయిల్, అమర్నాథ్, నాగరాజు, బాలరాజు, మహేష్, అహ్మద్, శైలజ, ప్రియాంక, ఉమా, అనిత, శ్రీలత, సుజాత, రవీందర్, కృష్ణ, మల్లేష్, లక్ష్మీ, ఉపేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి