రామగిరి వద్ద బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. హైదరాబాద్‌కు తరలింపు.
నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామగిరి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ టూ టౌన్ ఎస్సై అత్తి సతీష్ (34) తీవ్రంగా గాయపడ్డారు. విధులకు హాజరయ్యేందుకు బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
నేరేడుచర్ల మండలం కందులవారిగూడెం గ్రామానికి చెందిన సతీష్ మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. రోజూ స్వగ్రామం నుంచి విధులకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో బుధవారం బైక్‌పై వెళ్తుండగా రామగిరి వద్ద గుర్తుతెలియని వాహనం ఆయనను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, సతీష్‌ను మిర్యాలగూడలోని లీల ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి