రైతులకు 24 గంటల విద్యుత్ అందించాలి.. సమస్య పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తాం: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
చిట్యాల, అక్టోబర్ 14:
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో నెలకొన్న లోఓల్టేజీ సమస్యను పరిష్కరించి రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు వెలిమినేడు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. విద్యుత్ సరఫరాలో నెలకొన్న సమస్యలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. లోఓల్టేజీ సమస్య కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించి విద్యుత్ సరఫరాను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.రైతుల ఇబ్బందులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి