సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల కేంద్రంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.మానూర్ డిప్యూటీ కలెక్టర్, మండల ప్రత్యేక అధికారి ప్రతిభ శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు.తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల్లో ఐక్యత,ఆనందాన్ని పెంపొందిస్తుందని,ఇలాంటి వేడుకల ద్వారా మన సంస్కృతి,సంప్రదాయాలను భావితరాలకు అందించవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విష్ణు సాగర్,ఎంపీడీవో చంద్రశేఖర్,ఆర్ఐ ఖాజా కూతుబుద్దీన్,జూనియర్ అసిస్టెంట్ ఖాజా మొయినుద్దీన్,మండల సమాఖ్య ఏపీఎం అనంతయ్య,సీసీలు వీర్ కుమార్,హడమండ్లు, సాయిలు,హనుమంత్ రెడ్డిమండల సమాఖ్య అకౌంటెంట్ సంజీవ్, మండల సమాఖ్య కంప్యూటర్ ఆపరేటర్ మీనా,వివిధ గ్రామాలకు చెందిన మహిళా సంఘాల అధ్యక్షులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
మానూర్లో తహసీల్దార్ ఆవరణంలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి