Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కన్నులపండువగా నవరాత్రి ఉత్సవాలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 08:23 PM

పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి.. దర్యాప్తులో వేగం పెంచాలి: జిల్లా ఎస్పీ

14-10-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలో నమోదైన కేసుల దర్యాప్తు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం, తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ గుర్తింపు, న్యాయస్థానాలు జారీ చేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్ల అమలుపై సమీక్షించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు త్వరగా న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.తీవ్రమైన నేరాల్లో శాస్త్రీయ ఆధారాలను సేకరించి, నిందితులకు శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపారు.ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆర్థిక, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండేలా ప్రచారం నిర్వహించాలని సూచించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ షీ టీమ్స్ నిరంతరం అప్రమత్తంగా పనిచేయాలని, మహిళలపై వేధింపులను అరికట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు, నేరాల నియంత్రణ, ఛేదనకు ఉపయోగపడేలా గ్రామాల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ప్రార్థనా స్థలాలు, పరిశ్రమలు, పెట్రోల్ బంకులు, ధాబాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.అనంతరం పోలీసు వాహనాల నిర్వహణను పరిశీలించిన ఎస్పీ, వాహనాలకు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తూ అత్యవసర సమయాల్లో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించి నగదు రివార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.పోలీసు శాఖలో సమర్థవంతంగా పనిచేసే సిబ్బందిని గుర్తించి ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి,డీఎస్పీలు సత్యయ్య గౌడ్, వెంకట్ రెడ్డి, సైదా నాయక్, శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరేందర్, పోలీసు ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నా

రు.

Sthanikam

పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి.. దర్యాప్తులో వేగం పెంచాలి: జిల్లా ఎస్పీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News