Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విధుల్లో ప్రతిభకు గుర్తింపు.. ప్రేమ్ కుమార్‌కు ప్రశంసా పత్రం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 11:20 PM

విధుల్లో ప్రతిభకు గుర్తింపు.. ప్రేమ్ కుమార్‌కు ప్రశంసా పత్రం

14-10-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సబ్‌డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ కుమార్‌కు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రేమ్ కుమార్ ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పోలీసు శాఖలో తనకు అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, తన సేవలను గుర్తించి ప్రశంసా పత్రం అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ప్రశంసా పత్రం అందుకోవడంలో సహకరించిన డీఎస్పీతో పాటు సీఐలు, ఎస్ఐలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ మరింత బాధ్యతతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

Sthanikam

విధుల్లో ప్రతిభకు గుర్తింపు.. ప్రేమ్ కుమార్‌కు ప్రశంసా పత్రం

Article Image

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సబ్‌డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ కుమార్‌కు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రేమ్ కుమార్ ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పోలీసు శాఖలో తనకు అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, తన సేవలను గుర్తించి ప్రశంసా పత్రం అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ప్రశంసా పత్రం అందుకోవడంలో సహకరించిన డీఎస్పీతో పాటు సీఐలు, ఎస్ఐలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ మరింత బాధ్యతతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News