గడ్డిఅన్నారం, అక్టోబర్ 15: కోదండరాంనగర్ కాలనీలో ఫుట్‌పాత్ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. ఈ మేరకు గురువారం వినతిపత్రం అందజేశారు.
సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలోని గడ్డిఅన్నారం డివిజన్ రెడ్డి బ్రదర్స్ లైన్లో తోపుడు బండ్లు, టిఫిన్ సెంటర్లు, టీ దుకాణాల నిర్వాహకులు ఫుట్‌పాత్‌లను ఆక్రమించడంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రహదారులకు ఇరువైపులా వాహనాల పార్కింగ్తో రాకపోకలకు ఆటంకం కలుగుతోందన్నారు. అనుమతులు లేని భవన నిర్మాణాలు, మగ్గం, ఎంబ్రాయిడరీ దుకాణాల నిర్వహణపైనా విచారణ జరిపించాలని కోరారు.
రాత్రివేళల్లో ఇబ్బందులు
మగ్గం దుకాణాల్లో పనిచేసే కొందరు కార్మికులు రాత్రివేళల్లో బహిరంగంగా మద్యం సేవిస్తూ స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని కాలనీ ప్రతినిధులు ఆరోపించారు. దీంతో మహిళలు, యువకులు భద్రతపై ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. మున్సిపల్, టౌన్ ప్లానింగ్, పోలీసు అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఆక్రమణలను తొలగించాలని, రాత్రివేళల్లో పోలీసు పెట్రోలింగ్ పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రేమ్‌నాథ్ గౌడ్, ప్రతినిధులు బి. వెంకటేశ్వరరావు, కార్యదర్శి జి. నారాయణమూర్తి, సభ్యులు రామేశ్వరం, శరత్, పండరీనాథ్, సన్నీ, గండి జగన్, విక్కీజేశ్వర్, శివగౌడ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. వినతిపత్రం ప్రతులను డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి, స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు అందజేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి