Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:40 PM

కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు!

కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు!

కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు!
15-10-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

సాగునీరు, విద్యుత్‌ కొరతతో రైతుల ఆందోళన.. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలన.

కట్టంగూర్: నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం కురుమర్తి గ్రామంలో సాగునీరు, విద్యుత్‌ సరఫరాలో అంతరాయాల కారణంగా ఎండిపోతున్న పంట పొలాలను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడిన ఆయన.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సుమారు 100 ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్లు రైతులు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు.

ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు సాగునీరు, విద్యుత్‌ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సరైన నీరు, నాణ్యమైన విద్యుత్‌ అందక రైతులు పంటలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రోజుకు 4–5 గంటలే విద్యుత్‌ సరఫరా

గ్రామంలో ప్రస్తుతం రోజుకు నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే విద్యుత్‌ సరఫరా అవుతోందని రైతులు వాపోతున్నట్లు చిరుమర్తి లింగయ్య తెలిపారు. కరెంట్‌ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని, విద్యుత్‌ అంతరాయాలతో మోటార్ల స్టార్టర్లు సైతం కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

గత బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ 24 గంటల విద్యుత్‌ సరఫరా చేశారని రైతులు గుర్తుచేస్తున్నారని అన్నారు. తమ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని రైతులు చెబుతున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా రైతులు అల్లి లింగయ్య, చంద్రకళతో పాటు పలువురు రైతులు తమ పంటలు ఎండిపోతున్న తీరును మాజీ ఎమ్మెల్యేకు వివరించారు. సాగు కోసం నీరు, విద్యుత్‌ సక్రమంగా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.

రైతులను ఆదుకోవాలి

ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌తో పాటు అవసరమైన సాగునీటిని అందించాలని చిరుమర్తి లింగయ్య డిమాండ్‌ చేశారు. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే రానున్న రోజుల్లో రైతుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Sthanikam

కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News