Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:24 PM

బతుకమ్మ వేడుకల్లో వికలాంగ మహిళల సందడి.ఎన్‌పీఆర్‌డీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆటపాటలు.

15-10-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, అక్టోబర్ 15: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ఎన్‌పీఆర్‌డీ మహిళా విభాగం ఆధ్వర్యంలో గురువారం బతుకమ్మ ఆటపాటల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

మహిళల ఐక్యతకు ప్రతీక బతుకమ్మ

ఈ సందర్భంగా ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ కొత్త లలిత మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. తెలంగాణ ప్రజల జీవన విధానంలో ఈ పండుగకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. వికలాంగ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

సమాన అవకాశాలు కల్పించాలి

వికలాంగ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, వారికి సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. మహిళల్లో ఐక్యతా భావాన్ని, ఉత్సాహాన్ని పెంపొందించడమే బతుకమ్మ ఆటపాటల కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా నాయకురాళ్లు మంజుల, ఇందు, రాణి, ప్రశాంతి, నరసమ్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బతుకమ్మ వేడుకల్లో వికలాంగ మహిళల సందడి.ఎన్‌పీఆర్‌డీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆటపాటలు.

Article Image

భువనగిరి, అక్టోబర్ 15: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ఎన్‌పీఆర్‌డీ మహిళా విభాగం ఆధ్వర్యంలో గురువారం బతుకమ్మ ఆటపాటల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

మహిళల ఐక్యతకు ప్రతీక బతుకమ్మ

ఈ సందర్భంగా ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ కొత్త లలిత మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. తెలంగాణ ప్రజల జీవన విధానంలో ఈ పండుగకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. వికలాంగ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

సమాన అవకాశాలు కల్పించాలి

వికలాంగ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, వారికి సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. మహిళల్లో ఐక్యతా భావాన్ని, ఉత్సాహాన్ని పెంపొందించడమే బతుకమ్మ ఆటపాటల కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా నాయకురాళ్లు మంజుల, ఇందు, రాణి, ప్రశాంతి, నరసమ్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News