నేలమర్రిలో ఎండిన పంటలను పరిశీలించిన సీపీఎం నాయకులు
ఎల్నినో ప్రభావంతో ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం మునగాల మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మునగాల మండలం నేలమర్రి గ్రామంలో ఎండిన వరి పంటలను సీపీఎం నాయకులు పరిశీలించారు. మునగాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. పంటలు ఎండిపోవడంతో వరి పొలాల్లో పశువులను మేపాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పగటిపూట నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, పంట నష్టాన్ని అంచనా వేసి తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చంద్రయ్య, స్టాలిన్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు స్వరాజ్యం, కలకోవా సర్పంచ్ వెంకటాద్రి, మండల కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి, నాయకులు సుందరయ్య, శివాజీ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి