మున్సిపాలిటీ పరిధిలోని బంగారిగడ్డ 20వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అర్హులైన పేద లబ్ధిదారులకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వయంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ స్మార్ట్ కార్డుల ద్వారా ప్రజలకు భవిష్యత్తులో రేషన్ సేవలు మరింత సులభంగా, పారదర్శకంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ యండి హన్నుబాయ్, కో-ఆప్షన్ మెంబర్ యండి బాబషరిప్, 20వ వార్డు అధ్యక్షులు ఉడుగు వెంకటేశం గౌడ్, కాంగ్రెస్ పార్టీ కమిటీ వైస్ చైర్మన్ యండి వహీద్, మాజీ చైర్మన్ యండి ఎజాష్ పాషా, యండి ఇబ్రహీం, పలువురు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో మహిళా లబ్ధిదారులు పాల్గొన్నారు.
బంగారిగడ్డలో అర్హులైన పేదలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

K.RAVI

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి