చౌటుప్పల్ 17వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని 17వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు, కో-ఆప్షన్ మెంబర్ పస్తం గంగారాములు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సహకారంతో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు త్వరలోనే ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నామని, దీనిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తోందని గుర్తుచేశారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఇప్పటివరకు కార్డులు రాని వారు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ సహకారంతో 17వ వార్డును అన్ని రంగాల్లో అంచలంచలుగా అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గుజ్జుల సురేందర్ రెడ్డి, జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కోఆర్డినేటర్ పెద్దగోని రమేష్ గౌడ్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మాదాని గోపాల్, కాంశేటి భాస్కర్, ఐఎన్టీయూసీ మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల గణేష్ కుమార్, ఓర్సు రాజు, వీరమల్ల సత్తయ్య, బొజ్జ రాజు, రెవెన్యూ జీపీవో నాగభూషణం, ధనలక్ష్మి, యర్రబోతు దయాకర్ రెడ్డి, కళ్లెం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి