సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికల హక్కులు, భద్రత, సంక్షేమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలన, బాలికల విద్య ప్రాముఖ్యత, మహిళా సాధికారత తదితర అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.బాలికలకు చిన్న వయస్సులోనే వివాహాలు చేయకుండా, ఉన్నత విద్యను అందించి తమ కాళ్లపై తాము నిలబడేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. మహిళలు, బాలికల హక్కులను కాపాడటం, వారికి సమాన అవకాశాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మహిళలపై హింస, వివక్ష, బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు, బాలికల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన పెంచుకొని, అర్హులైన వారు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప మాట్లాడుతూ.. బాలికల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే వారికి నాణ్యమైన విద్య అందించడంతో పాటు,భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించాలని, బాలికలు చదువులో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు.మహిళలు,బాలికల అభివృద్ధికి గ్రామస్థులందరూ సహకరించాలని,సమాజంలో మహిళలకు గౌరవం, సమాన అవకాశాలు కల్పించినప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఫైనాన్షియల్ స్పెషలిస్ట్ పుల్కంటి నర్సింలు గ్రామ ఉపసర్పంచ్ మొల్ల కరీం,వార్డు సభ్యులు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు, యువత పాల్గొన్నారు.
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి