చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రూపని అజిత్ కుమార్ జన్మదిన వేడుకలను గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అజిత్ కుమార్ను శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు, యువకులు అజిత్ కుమార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు దేశబోయిన లింగస్వామి, యువకులు గోలి సాయికిరణ్, వడ్డేపల్లి ఉపేందర్, కంచుకొమ్ముల విష్ణు, రూపని నితిన్, వరికుప్పల చింటూ, వరికుప్పల రాము, ఆరూరి శివ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి