Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:34 AM

రాత్రి పెట్రోలింగ్‌ ముమ్మరం చేయాలి. నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా పెట్టాలి. పోలీసు అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్‌

16-10-2026 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

17 కీలక కేసుల ఛేదన.. మల్కాజిగిరి పోలీసులకు డీజీపీ ప్రశంసలు

మల్కాజిగిరి, అక్టోబర్‌ 15:

నేరాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన.. కమిషనరేట్‌ పరిధిలో నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, పోలీసుల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.

రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ ముమ్మరం చేయడంతోపాటు బీట్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ప్రజల్లో భద్రతాభావం కల్పించేలా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నేరాల నియంత్రణ, దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, సీసీటీఎన్‌ఎస్‌లో కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

24 గంటల్లో కేసు ఛేదన

ప్రస్తుత ఏడాదిలో నమోదైన 17 కీలక కేసులను ఛేదించిన మల్కాజిగిరి పోలీసులను డీజీపీ అభినందించారు. ఇటీవల చిన్నారి కిడ్నాప్‌, హత్య కేసును 24 గంటల్లో ఛేదించడంపై ప్రత్యేకంగా ప్రశంసించారు. కీలక కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు. ఆధారాల సేకరణ, వృత్తి నైపుణ్యం, కేసులపై నిరంతర పర్యవేక్షణతో న్యాయం జరిగేలా చూడాలన్నారు.

పోలీసులకు నిరంతర శిక్షణ, నైపుణ్యాభివృద్ధి అవసరమని పేర్కొన్నారు. విధుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ వృత్తి నైపుణ్యం, జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు. అనంతరం అధికారుల నుంచి సమస్యలు, వినతులను స్వీకరించి, వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సమావేశంలో మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ బి. సుమతి ఐపీఎస్‌తోపాటు డీసీపీలు, అదనపు డీసీపీ, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Sthanikam

రాత్రి పెట్రోలింగ్‌ ముమ్మరం చేయాలి. నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా పెట్టాలి. పోలీసు అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్‌

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News