వాకింగ్ చేస్తున్న ముగ్గురిని ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు.
సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాలెంల స్టేజ్ వద్ద వాకింగ్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను డీసీఎం వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంలో మృతి చెందిన వారిని బాలెంల గ్రామానికి చెందిన గుర్రం సైదులు, ఆలకుంట్ల నాగరాజుగా గుర్తించారు. మరో వ్యక్తి గొల్ల జానయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జానయ్యను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి