శ్రీశైలం జలాశయంలో కనిపించే జంతువులు ఇక్కడికి ఎలా వచ్చాయి?
మత్స్యకారులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు రూపాని రాజు వడ్డేపల్లి రమేష్ విజ్ఞప్తి.
నార్కట్పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండల పరిధిలోని ఉదయ సముద్రం జలాశయంలో నీటి కుక్కల సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. సాధారణంగా శ్రీశైలం జలాశయంలో కనిపించే ఈ జంతువులు ఉదయ సముద్రం జలాశయానికి ఎలా చేరుకున్నాయనే అంశంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జలాశయం పరిసర ప్రాంతాల్లో వీటి సంచారం చర్చనీయాంశంగా మారింది.
జలాశయంలో చేపలు పట్టేందుకు వెళ్లే మత్స్యకారులు, పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రూపాని రాజు వడ్డేపల్లి రమేష్ సూచించారు. జలాశయంలో సంచరిస్తున్న నీటి కుక్కలను వీడియో తీసిన వారు ప్రజలు వాటికి దూరంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని కోరారు.ఈ ఘటనపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, జలాశయంలో నీటి కుక్కల సంచారానికి గల కారణాలను పరిశీలించాలని రూపాని రాజు వడ్డేపల్లి రమేష్ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి