Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:33 PM

చౌటుప్పల్ వద్ద 25 క్వింటాళ్ళ పిడిఎస్ బియ్యం సీజ్: ఇద్దరిపై కేసు నమోదు

26-08-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 25 క్వింటాళ్ళ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మథ కుమార్ తెలిపారు.

​మంగళవారం అందిన నమ్మదగిన సమాచారం మేరకు పి.డి.ఓ/ఏఎస్ఐ పి. కరుణాకర్ ఆధ్వర్యంలో పెట్రోల్ మొబైల్ సిబ్బంది పిసి-3554 ఎం. సందీప్, ఏఆర్‌పిసి-7967 ఎల్. సీతారాం రెడ్డిలతో కలిసి చౌటుప్పల్ వలిగొండ ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఒక వాహనాన్ని ఆపి విచారించారు. మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల నుంచి రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేసి, ఎక్కువ ధరకు విక్రయించడానికి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. వాహన డ్రైవర్ లావుడ్య శ్రీనివాస్ (30), వాహన సహాయకుడు గుగులోతు అరుణ్ (18)లను అదుపులోకి తీసుకుని, 25 క్వింటాళ్ళ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ మన్మథ కుమార్ వివరించారు.

Sthanikam

చౌటుప్పల్ వద్ద 25 క్వింటాళ్ళ పిడిఎస్ బియ్యం సీజ్: ఇద్దరిపై కేసు నమోదు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News