Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:54 PM

బోరంచలో విద్యార్థులకు షీ టీమ్ అవగాహన కార్యక్రమం

25-08-2026 140 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం బోరంచ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంగారెడ్డి జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి,ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. నారాయణఖేడ్ డివిజన్ షీ టీమ్ ఇంచార్జీ ఏఎస్ఐ తులసిరాం మాట్లాడుతూ మహిళల రక్షణకు షీ టీమ్ నిరంతరం పనిచేస్తోందని, మహిళల హక్కులు, బాలల రక్షణ చట్టాలు, పని ప్రదేశాల్లో వేధింపులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఫేక్ ఖాతాలు, ఆన్‌లైన్ మోసాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అత్యవసర సమయంలో 100, 112, సైబర్ నేరాల కోసం 1930, బాలల కోసం 1098, సంగారెడ్డి షీ టీమ్ 8712656772 నంబర్లను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో షీ టీమ్ కానిస్టేబుల్ చాంగుబాయి, ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి, ఉపాధ్యాయులు, నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళల భద్రత, బాలల సంక్షేమం, సైబర్ నేరాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

బోరంచలో విద్యార్థులకు షీ టీమ్ అవగాహన కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News