Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:30 PM

స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రత్యేక శిక్షణ

25-08-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కల్హేర్ మండలం ఇందిరానగర్‌లో స్వయం సహాయక సంఘాల సభ్యులకు సంఘాల బలోపేతం, నిర్వహణ, మహిళల ఆర్థిక అభివృద్ధిపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ ఎస్‌పీఎం బీమయ్య, డీపీఎం జాన్ కెన్నెడీ, ఏపీఎం శివకుమార్ పాల్గొని మహిళలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సంఘ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించడం, పొదుపు పెంచుకోవడం, అంతర్గత రుణాలను సద్వినియోగం చేసుకోవడం, సంఘ రికార్డులను సక్రమంగా నిర్వహించడం, సభ్యులందరి భాగస్వామ్యంతో నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని సంఘాలను మరింత బలోపేతం చేసుకోవాలని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం వంశీకృష్ణ, సీసీ కల్పన, సీఆర్‌పీలు సంధ్యారాణి, ప్రమీల, వీఓఏ శంకర్ నాయక్, వీఓ అధ్యక్షురాలు లక్ష్మీతో పాటు ఇందిరానగర్ స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రత్యేక శిక్షణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News