Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ అక్షాన్ష్ యాదవ్

21-08-2026 230 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రికార్డులు, సీసీటీఎన్ఎస్ నిర్వహణ పక్కాగా ఉండాలి

బాధితులతో మర్యాదగా వ్యవహరించి, త్వరితగతిన న్యాయం చేయాలి

సైబర్ నేరాలపై సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి

యాదాద్రి భువనగిరి జిల్లాలో వృత్తిపరమైన పోలీసింగ్‌ను బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని జనరల్ డైరీ ఎంట్రీలు, సీసీటిఎన్ఎస్ పనితీరు, వివిధ రికార్డులు, రిజిస్టర్లను ఆయన సమగ్రంగా పరిశీలించారు. ​అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదగా, గౌరవప్రదంగా వ్యవహరించాలని, బాధితుల సమస్యలను ఓర్పుతో విని చట్టప్రకారం వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. నేరాల నియంత్రణకు ముందుజాగ్రత్త చర్యలు కీలకమని, ముఖ్యంగా సైబర్ మోసాలు, నూతన నేరాల తీరుపై సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సమర్థవంతమైన పోలీసింగ్‌కు క్రమశిక్షణ, పారదర్శకత, అంకితభావం ప్రాథమిక సూత్రాలని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, సీఐ మన్మధ కుమార్, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ అక్షాన్ష్ యాదవ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News