Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:35 PM

ప్రిన్సిపాల్‌ రూపా రెడ్డి హత్యను ఖండిస్తూ ప్రైవేటు ఉపాధ్యాయుల నిరసన ర్యాలీ

21-08-2026 146 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: నల్లగొండ జిల్లా మల్లేపల్లి మండల కేంద్రంలోని నాగార్జున గ్రామర్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్రీమతి రూపా రెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ చిట్యాల పట్టణంలో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్య సంఘం (ట్రస్మా) ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, పాఠశాలల సిబ్బంది, యాజమాన్యాలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పోలీస్‌, మున్సిపల్‌ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

రూపా రెడ్డి హత్యను మండలంలోని పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు తీవ్రంగా ఖండించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దే పవిత్రమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులపై దాడులు జరగడం బాధాకరమన్నారు. పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, ఇతర సిబ్బందికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

ఐదు ప్రధాన డిమాండ్లు.

రూపా రెడ్డి హత్యకు పాల్పడిన నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలల వద్ద భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు యాజమాన్యాలు, ఉపాధ్యాయులపై బెదిరింపులు, దాడులు జరిగితే వెంటనే ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. ఉపాధ్యాయుల భద్రతపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

‘ఉపాధ్యాయుల భద్రతే విద్యా వ్యవస్థకు భద్రత’ అనే భావనతో ప్రభుత్వం, అధికారులు ఈ అంశంపై తక్షణమే స్పందించాలని ట్రస్మా ప్రతినిధులు కోరారు.కార్యక్రమంలో ట్రస్మా మండల శాఖ అధ్యక్షుడు ఎండి జమీరుద్దీన్‌, నాయకులు గట్టు అలెగ్జాండర్‌ రెడ్డి, పెద్ది నరేందర్‌, ప్రకాష్‌, జె. వేణుగోపాల్‌ రెడ్డి, బొడిగె విజయ్‌, బొడిగె రవి తదితరులతో పాటు పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రిన్సిపాల్‌ రూపా రెడ్డి హత్యను ఖండిస్తూ ప్రైవేటు ఉపాధ్యాయుల నిరసన ర్యాలీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News