Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:34 PM

భూమిని హిందూ ధార్మిక సంస్థలకు కేటాయించాలి.

20-08-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులో కల్యాణ మండపం నిర్మాణం కోసం దాతల విరాళాల సహకారంతో కొనుగోలు చేసిన భూమిని హిందూ ధార్మిక సంస్థలకు కేటాయించాలని చిట్యాల పట్టణ హిందూ బంధువుల సమితి ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సమితి ప్రతినిధులు తేరేటుపల్లి హనుమంతు, సకినాల సుధాకర్, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, మెండె వెంకన్న , జిట్టా నరేష్ గురువారం రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాజీ ఎమ్మెల్సీ చెరుపెల్లి సీతారాములకు వినతి పత్రాన్ని అందజేశారు.

కల్యాణ మండపం నిర్మాణం కోసం ప్రజలు, దాతల సహకారంతో కొనుగోలు చేసిన భూమిని ఇతర అవసరాలకు వినియోగించడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు. హిందూ ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక అవసరాలకు ఉపయోగపడేలా ఆ భూమిని సంబంధిత హిందూ ధార్మిక సంస్థలకు కేటాయించాలని కోరారు.

ప్రజల సహకారంతో సమకూర్చిన భూమి ఉద్దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలపై ఉందన్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని భూమిని హిందూ ధార్మిక సంస్థలకు కేటాయించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రజలు కూడా ఈ అంశంలో సహకరించాలని వారు కోరారు.

Sthanikam

భూమిని హిందూ ధార్మిక సంస్థలకు కేటాయించాలి.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News