Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:34 PM

రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు యువతే బలం

రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు యువతే బలం

రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు యువతే బలం
20-08-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్: భారతరత్న, భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నకిరేకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించడం ద్వారా దేశ రాజకీయాల్లో యువత భాగస్వామ్యాన్ని పెంచిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని అన్నారు. దేశాన్ని ఆధునిక సాంకేతికత వైపు నడిపించి, ఐటీ విప్లవానికి పునాదులు వేసిన దూరదృష్టి గల నాయకుడని కొనియాడారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి ఆయన చేపట్టిన సంస్కరణలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల భారంలోకి నెడుతోందని, పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, మత విద్వేషాలు పెరుగుతున్నాయని ఎమ్మెల్యే విమర్శించారు. యువత, పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రాహుల్ గాంధీ నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ప్రజా సంక్షేమం, దేశ అభివృద్ధి మరింత వేగంగా సాగుతుందని ఆకాంక్షించారు.

రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా 18 ఏళ్లు నిండిన యువతీ యువకుల ఓటరు నమోదును ఈ సందర్భంగా ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు యువతే బలం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News