Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

ప్రజల ఆరోగ్య రక్షణకు బోరంచలో చర్యలు

Updated : 19 Aug 2026 20:58 IST
As Preferred Source 1 min read
ప్రజల ఆరోగ్య రక్షణకు బోరంచలో చర్యలు

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దోమల నివారణ యంత్రాన్ని బుధవారం గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప ప్రారంభించారు. గ్రామంలో దోమల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు జ్వరాల బారిన పడే అవకాశం ఉన్నందున దోమల నివారణకు ఈ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా గ్రామంలో దోమల నివారణ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మొల్ల కరీం, వార్డు సభ్యులు శ్రీశైలం, గరీబ్, బాలకృష్ణతో పాటు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల ఆరోగ్య రక్షణకు బోరంచలో చర్యలు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దోమల నివారణ యంత్రాన్ని బుధవారం గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప ప్రారంభించారు. గ్రామంలో దోమల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు జ్వరాల బారిన పడే అవకాశం ఉన్నందున దోమల నివారణకు ఈ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా గ్రామంలో దోమల నివారణ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మొల్ల కరీం, వార్డు సభ్యులు శ్రీశైలం, గరీబ్, బాలకృష్ణతో పాటు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news