Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

ఫోటోగ్రాఫర్ల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి

19-08-2026 163 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రభుత్వం ఫోటో, వీడియో గ్రాఫర్లకు సబ్సిడీపై రుణాలు అందించి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని సదాశివపేట పట్టణ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగుల విజయ్ కుమార్ కోరారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సదాశివపేటలో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ కెమెరా కేవలం పరికరం మాత్రమే కాదని, అది ఫోటోగ్రాఫర్ల వృత్తికి గుర్తింపు అని అన్నారు. చరిత్రను భద్రపరిచే బాధ్యత ఫోటోగ్రాఫర్లపై ఉందన్నారు. యువ ఫోటోగ్రాఫర్లు ఆధునిక సాంకేతికతను నేర్చుకుని ఫోటోగ్రఫీతో పాటు వీడియో, డ్రోన్, ఎడిటింగ్, ఆల్బమ్ డిజైన్, సామాజిక మాధ్యమాల కంటెంట్, కృత్రిమ మేధస్సు వంటి నూతన రంగాల్లో నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. ఫోటోగ్రాఫర్ల ఐక్యతే తమ బలమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ముదిగొండ జయచింతన్, కోశాధికారి కర్ణాకర్, ఉపాధ్యక్షులు కాషా సంగమేశ్వర్, వై. మహేష్, శివశంకర్, గొల్లపల్లి శ్రీనివాస్, రుమాండ్ల రాజు, బండారి సుభాష్, ఎం. సంతోష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫోటోగ్రాఫర్ల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News