Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి

18-08-2026 159 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్మన్‌కు ఐఎన్‌టీయూసీ వినతి

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఐఎన్‌టీయూసీ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల గణేష్ కుమార్ కోరారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్మన్ మొగుదల పావని రమేష్ గౌడ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాతీయ రహదారి విస్తరణ పనుల కారణంగా చౌటుప్పల్‌లో ఎంతోమంది చిరు వ్యాపారులు, కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను వేగవంతం చేసి, బాధితులైన చిరు కార్మికులకు షాపులు కేటాయించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మున్సిపల్ ఛైర్మన్ పావని రమేష్ సానుకూలంగా స్పందించారు. స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన నిధులు మంజూరు చేయించి మార్కెట్ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ నాయకులు కొలని వినయ్, అతిసేరు బాలరాజు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News