Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఢిల్లీలో సీపీఎం నేతల అరెస్టు దుర్మార్గం: చౌటుప్పల్‌లో నేతల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:00 PM

నల్లగొండలో ‘లిటిల్ కార్ట్’ ఆన్‌లైన్ డెలివరీ సేవలు ప్రారంభం

18-08-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ, ఆగస్టు 17: నల్లగొండ పట్టణంలోని ముషంపల్లి రోడ్డులో ‘లిటిల్ కార్ట్’ ఆన్‌లైన్ డెలివరీ సేవలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి నల్లగొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సేవలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నల్లగొండ యువత ఆలోచనలు, ప్రతిభ, సాంకేతిక సామర్థ్యానికి ‘లిటిల్ కార్ట్’ మంచి ఉదాహరణగా నిలుస్తుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆన్‌లైన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. నిత్యావసర సరుకులను ఇంటి వద్దకే సులభంగా చేరవేసే విధానం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

10 నిమిషాల్లో డెలివరీ లక్ష్యం

‘లిటిల్ కార్ట్’ ద్వారా అన్ని రకాల నిత్యావసర సరుకులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్డర్ చేసిన సరుకులను వేగంగా వినియోగదారుల ఇంటి వద్దకే అందించనున్నట్లు చెప్పారు. 10 నిమిషాల్లో డెలివరీ అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

నల్లగొండలో సాంకేతికత ఆధారిత సేవలకు మరింత ఆదరణ పెరగాలని, ‘లిటిల్ కార్ట్’ విజయవంతంగా ముందుకు సాగాలని మేయర్ ఆకాంక్షించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ స్థానికంగా కొత్త ఆలోచనలకు ప్రోత్సాహం అందించే సంస్థలు మరిన్ని రావాలని అన్నారు.

కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ అలీ అమీర్, మాజీ కార్పొరేటర్ అస్సద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల సైదులు, ‘లిటిల్ కార్ట్’ సీఈఓ మేకల సతీష్ రెడ్డి, మేనేజర్ పోరెడ్డి ప్రమోద్ రెడ్డి, మర్రి నాగార్జున రెడ్డి, సత్యనారాయణరెడ్డి, సిబ్బంది స్వాతి, సౌజన్య, సృజనా, శ్వేత, జాన్సీ, జానకమ్మ, దుర్గ, విజయరాణి, స్థానిక ప్రముఖులు, యువత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నల్లగొండలో ‘లిటిల్ కార్ట్’ ఆన్‌లైన్ డెలివరీ సేవలు ప్రారంభం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News